ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్‌గిరి జిల్లా, చిత్రకొండ మండలం కటాఫ్ ప్రాంతంలో రలేగఢ్ పంచాయతీలోని సువాపల్లి, నేరుడిపల్లి, సువామగోల్ ఇంకో నాలుగు గ్రామాలు నదికి అవతల కొండల మీద ఉంటాయి. ఈ గ్రామాల్లోని చిన్నారులు, గర్భిణిలకు పౌష్టికాహారం అందించేందుకు సువాపల్లి, నేరుడుపల్లిలో రెండు అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి.
సాహసం: పోటెత్తుతున్న నదిని ఈదుకుంటూ విధులకు... - Odisha Anganwadi activists service to pregnant women
అంగన్‌వాడీ కేంద్రాల్లో విధులు నిర్వర్తించేందుకు ఇద్దరు కార్యకర్తలు తమ ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. ఎండిన ఆనపకాయలను వీపునకు కట్టుకుని ఈతగాళ్ల సాయంతో నదిని దాటి కేంద్రాలకు చేరుకుంటున్నారు.
![సాహసం: పోటెత్తుతున్న నదిని ఈదుకుంటూ విధులకు... Odisha Anganwadi activists goes to work by swimming through a river](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9032476-376-9032476-1601708379740.jpg)
నదిని ఈదుకుంటూ విధులకు
వాటిల్లో పనిచేస్తున్న కార్యకర్తలు హేమలత శిశ, ప్రమీల పల్మెల వర్షాకాలం వస్తే నది దాటుకుని వెళ్లాలి. ఇటీవల వర్షాలకు నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా.. గల్లంతయ్యే ప్రమాదమున్నా సాహసం చేసి నదిని దాటుతున్నారు. వారంలో ఒకరోజు కొండలపై ఉన్న గ్రామాలకు వెళ్లి చిన్నారులకు, గర్భిణిలకు పోషకాహారం అందజేస్తున్నారు.