Odelu couple who joined TRS from Congress: చెన్నూరు మాజీ ఎమ్మల్యే నల్లాల ఓదెలు.... మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్ నల్లాల జయలక్ష్మిలు కేటీఆర్ సమక్షంలో తిరిగి తెరాసలో చేరారు. మంచిర్యాల జిల్లా తెరాస అధ్యక్షుడు బాల్క సుమన్‌తో కలిసి నల్లాల ఓదెలు దంపతులు ప్రగతిభవన్‌కు వచ్చారు. ఓదెలు దంపతులను కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల ఎన్నికల్లో చెన్నూరు నుంచి టికెట్ దక్కకపోవటంతో ఓదెలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేస్తున్న వేళ... తిరిగి తెరాసలోకి చేరారు. ఈ దంపతులు ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు.
తెరాసలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఓదెలు.. పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ - ఓదెల దంపతులు కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో చేరిక
Odelu couple who joined TRS from Congress: ఓదెలు దంపతులు ఈ రోజు తెరాస పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవల వీరు ఇరువురు ఎమ్మెల్యే టికెట్ దొరకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్లీ ప్రగతి భవన్లో కేసీఆర్‌తో సమావేశమై తెరాసలో గూటికి చేరుకున్నారు.
టీఆర్ఎస్
నల్లాల ఓదెలు గతంలో తెరాస నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ విప్‌గా కూడా పనిచేశారు. జయలక్ష్మి తెరాస నుంచి జడ్పీ చైర్ పర్సన్‌గా ఎన్నికయ్యారు. కొన్ని నెలల క్రితం వారు ఇరువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతిభవన్ లో సమావేశమయ్యారు.
ఇవీ చదవండి:
Last Updated : Oct 5, 2022, 3:03 PM IST