తెలంగాణ

telangana

ETV Bharat / city

రాజధానిలో 'ఆక్టోపస్' ప్రత్యేక తనిఖీలు - Octopus Commandos And Police Mock Drill At MalakPet

అక్టోపస్ కమెండోలు.. రాజధానిలో తనిఖీలు చేపట్టారు. మలక్​పేట్ టీవీ టవర్, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాల్లో కమెండోలు వాహనాలు, దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.

Octopus Commandos And Police Mock Drill At MalakPet
నగరంలో అలర్ట్ అయిన పోలీసులు

By

Published : Feb 28, 2020, 1:53 PM IST

హైదరాబాద్ మలక్​పేట్ టీవీ టవర్, దిల్​సుఖ్​నగర్ ప్రాంతాల్లో ఆక్టోపస్ టీం తనిఖీలు చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో ఎలా ఉండాలో వివరిస్తు కమెండోలు మాక్ డ్రిల్ నిర్వహించారు. వాహనాలు, దుకాణాల్లో సోదాలు నిర్వహించారు.

సాధారణ తనిఖీల్లో భాగంగానే.. నగరంలోని ముఖ్యమైన జంక్షన్లలో ఈ సోదాలు నిర్వహించినట్లు ఆక్టోపస్ అధికారులు తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తూ.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందు జాగ్రత్తల గురించి వివరించినట్లు పేర్కొన్నారు. కమెండోల సోదాలను స్థానికులు ఆసక్తిగా గమనించారు. ఇందులో స్థానిక పోలీసులు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు.

నగరంలో అలర్ట్ అయిన పోలీసులు

ABOUT THE AUTHOR

...view details