కలకలం రేపిన క్షుద్రపూజలు... స్థానికుల్లో భయాందోళనలు - మునగాలపాడులో పుర్రెతో పూజలు
ఇంటి ముందు పుర్రెలు, చీపురు, కుంకుమ కనిపించేసరికి ఆ ఇంటి యజమాని కంగారుపడింది. ఆమెపై క్షద్రపూజలు చేశారేమోనని భయపడింది. ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని మునగాలపాడులో ఈ ఘటన జరగగా..పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

kshudra poojalu
ఆంధ్రప్రదేశ్ కర్నూలు సమీపంలోని మునగాలపాడు గ్రామంలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. మునగాలపాడులో రాములమ్మ అనే మహిళ ఇంటి ముందు మంగళవారం ఉదయం గుర్తుతెలియని దుండగులు... పసుపు, కుంకుమ చల్లి పుర్రె,ఎముకలు, నిమ్మకాయలు,చీపురుకట్ట పెట్టారు. ఆమె వాటిని చూసేసరికి భయానికి గురైంది. స్థానికులు కూడా కంగారు పడ్డారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఎవరైనా కక్షగట్టి ఇలా చేశారా ఇతర కారణాలు ఉన్నాయా అనేది దర్యాప్తు చేయాల్సి ఉంది.