హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్‌లోని సమాచారాన్ని కాపీ కొట్టాడు ఓ వ్యక్తి. తన వ్యక్తిగత వైబ్సైట్లో ఈ వివరాలన్ని నమోదు చేశాడు. అంతర్జాలంలో నుమాయిష్ సమాచారం వెదికితే మొదట కనపడేది ఇతని వెబ్‌సైటే. సాంకేతికతను ఉపయోగించి మోసం చేసినందకు గాను ఆ వ్యక్తికి సీసీఏస్ సైబర్ క్రైం పోలీసులు తాఖీదులు జారీ చేశారు.
అధికారిక వెబ్సైట్ వెతికితే కనిపించేది నకిలీదే...
మల్లిఖార్జునరావు అనే ప్రైవేట్ ఉపాధ్యాయుడు అచ్చం నుమాయిష్ వెబ్‌సైట్‌ను పోలి ఉండే నకిలీ వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఎగ్జిబిషన్లో జరిగే రోజువారీ కార్యక్రమాలు, ప్రత్యేక కార్యక్రమాలను మల్లికార్జునరావు తన నుమాయిష్ వైబ్సైట్లో ఉంచారు. ఎగ్జిబిషన్లో ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు నెటిజన్లు అంతర్జాలంతో శోధించగానే ఈ వెబ్ సైట్ ప్రత్యక్షమవుతోంది. దీంతో నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ నిర్వాకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ కార్యాలయానికి రావాలంటూ మల్లిఖార్జున్‌ను పోలీసులు ఆదేశించారు. ఇవాళ ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యాడు.