ఏపీలోని నాలుగు పట్టణాల్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయించింది. రేపల్లె, పాలకొల్లు, కుప్పం, టెక్కలి పట్టణాల్లో ప్లాంట్లు నెలకొల్పనున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో వీటిని ప్రారంభిస్తారు. హోమ్ ఐసోలేషన్లో చికిత్స పొందుతున్న కరోనా రోగులకు ఇప్పటికే 10 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను ఎన్టీఆర్ ట్రస్టు అందుబాటులోకి తెచ్చింది.
ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో 4 ఆక్సిజన్ ప్లాంట్లు - oxygen plants in AP
ఏపీలో 4 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్టు నిర్ణయించింది. గుంటూరు జిల్లా రేపల్లె, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. ప్లాంట్లను.. హెరిటేజ్ సీఎస్ఆర్ ఫండ్స్ సహకారంతో ఏర్పాటు చేస్తున్నట్లు ట్రస్టు వెల్లడించింది.

ఎన్టీఆర్ ట్రస్టు
లోకేశ్వరరావు నేతృత్వంలోని విదేశీ వైద్యులతో టెలీమెడిసిన్ సేవలు కొనసాగిస్తూ.. 24గంటలు పనిచేసే కాల్ సెంటర్ను అందుబాటులో ఉంచారు. కరోనా రోగులకు ఎలాంటి సాయం అవసరమున్నా.. తామున్నామని ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపింది. తెలుగుదేశం కార్యకర్తలు సంయుక్తంగా.. జిల్లాల్లో ఉచితంగా మందులు, భోజనం, నిత్యావసర వస్తువులు తదితర సహాయాలను అందిస్తున్నట్లు పేర్కొన్నారు
ఇదీ చదవండీ:అడవి బిడ్డల ఆకలి తీరుస్తోన్న సీతక్క