తెలంగాణ

telangana

ETV Bharat / city

NTR Trust Services: వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయక చర్యలు - floods effected district in andhra pradesh

ఏపీలోని వరద ప్రాంతాల్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సహాయక చర్యలు(NTR Trust Services at floods effected areas) కొనసాగుతున్నాయి. ట్రస్ట్ ఛైర్​పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాలతో.. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని వరద బాధితులకు తాగునీరు, పాలు, ఇతర ఆహార పదార్ధాలు అందజేశారు.

NTR Trust Services
ఎన్టీఆర్​ ట్రస్ట్​ సేవా కార్యక్రమాలు

By

Published : Nov 24, 2021, 8:16 AM IST

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఆంధ్రప్రదేశ్​లోని పలు జిల్లాలు జల దిగ్బంధం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకుపోయి ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలో పలు వరద ప్రాంతాల్లో ఎన్టీఆర్​ ట్రస్ట్​ తన సేవలను అందిస్తోంది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఛైర్​పర్సన్ నారా భువనేశ్వరి ఆదేశాలతో వరద ప్రాంతాల్లో ట్రస్ట్ సహాయక చర్యలు(NTR Trust Services at floods effected areas) కొనసాగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరదలతో నిరాశ్రయులైన ప్రజానీకానికి తాగునీరు, ఇతర ఆహార పదార్థాలను ఎన్టీఆర్ ట్రస్ట్​ అందజేస్తోంది.

గత ఐదు రోజులుగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో ట్రస్ట్ సభ్యులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ముంపు ప్రాంతాల్లో ఉన్న వారికి సాయం చేస్తూ.. వాళ్లు తమ ఉదారతను చాటుకుంటున్నారు.

ఇదీ చదవండి:TSRTC Single Day Income: ఒక్కరోజే టీఎస్​ఆర్టీసీకి రికార్డు స్థాయిలో రాబడి.. ఎంతంటే?

ABOUT THE AUTHOR

...view details