తెలంగాణ

telangana

ETV Bharat / city

NTR TRUST: కుప్పం ప్రభుత్వ ఆస్పత్రికి ఎన్టీఆర్ ట్రస్ట్ చేయూత - NTR Trust

ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం ప్రభుత్వాసుపత్రికి (kuppam govt hospital) ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR trust) ఆధ్వర్యంలో ఆక్సిజన్ ప్లాంట్ (oxygen plant) అందించారు. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు (TDP leader chandrababunaidu) ఆదేశాలతో రూ.45 లక్షలు వ్యయం చేసి.. ప్లాంటును అందుబాటులోకి తెచ్చారు.

NTR TRUST
ఎన్టీఆర్

By

Published : Jul 15, 2021, 5:10 PM IST

ఏపీ చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గానికి ఎన్టీఆర్ ట్రస్ట్ (NTR Trust) వితరణతో... ఆక్సిజన్ ప్లాంట్​ను అందించారు. స్థానిక ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రూ.45 లక్షల వ్యయంతో ప్లాంట్ను అందుబాటులోకి తెచ్చారు.

ఈ క్రమంలో ఇవాళ కుప్పం చేరుకున్న ఆక్సిజన్ ప్లాంట్ కు తెదేపా కార్యాలయం వద్ద పూజలు చేసి పట్టణంలో ఊరేగించారు. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ర్యాలీ చేస్తుండగా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేతలు అభ్యంతరం చెప్పారు.

ఇదీచూడండి:hyderabad floods: సరూర్​నగర్​లో వరదలు.. ఇళ్లు వదిలివెళ్తున్న స్థానికులు

ABOUT THE AUTHOR

...view details