రాష్ట్రంలో 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయం - ntr trust activities
12:46 June 01
రాష్ట్రంలో 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయం
రాష్ట్రంలో 2 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్ణయం తీసుకొంది. అనాథ మృతదేహాల అంత్యక్రియలకు ట్రస్ట్ సేవా విభాగం ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టెలీమెడిసిన్, మందుల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరీ తెలిపారు. కాల్ సెంటర్ ద్వారా కరోనా రోగులకు నిరంతరంగా సేవలు అందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే ఏపీలోని గుంటూరు జిల్లా రేపల్లె, పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు, చిత్తూరు జిల్లా కుప్పం, శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ తెలిపింది. తాము చేపడుతున్న సేవా కార్యక్రమాలకు దాతల నుంచి అనూహ్య స్పందన వస్తుందని భువనేశ్వరి వెల్లడించారు. దాతలకు ధన్యవాదాలు తెలిపారు.