తెలంగాణ

telangana

ETV Bharat / city

ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు! - ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ తాజా వార్తలు

ఉన్నతస్థాయిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఏపీలో దుమారం రేపింది. మళ్లీ జగనే ఏపీ సీఎం అవుతారని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ అన్నారు. కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్ డే కార్యక్రమంలో పాల్గొన్న శ్యామ్ ప్రసాద్ ఈ విధంగా వ్యాఖ్యానించారు.

ntr-health-varsity-vc-controversial-comments-in-kurnool-medical-college-freshers-day-celebrations
ఏపీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు!

By

Published : Feb 19, 2021, 1:32 PM IST

ఏపీలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ శ్యామ్​ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మళ్లీ జగనే ఏపీ సీఎం అవుతారంటూ వైస్ ఛాన్సలర్ డా.శ్యామ్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. కర్నూలు వైద్య కళాశాల విద్యార్థుల ఫ్రెషర్స్​ డే కార్యక్రమంలో పాల్గొన్న వీసీ మాట్లాడుతూ.. జగన్ అప్పులు తెచ్చి రాష్ట్రానికి అన్నీ చేస్తున్నారన్నారు. కొత్తగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారనీ... వైద్యులు విధులకు రాకపోవటం పెద్ద సమస్య కాదని శ్యామ్ ప్రసాద్ అన్నారు.

ఏపీ ఆరోగ్య విశ్వవిద్యాలయ వీసీ వివాదాస్పద వ్యాఖ్యలు!

ABOUT THE AUTHOR

...view details