శంషాబాద్‌లో రెండు పబ్బులను ఎన్‌ఎస్‌యుఐ నేతలు, కార్యకర్తలు ముట్టడించారు. పెద్ద ఎత్తున పబ్బుల వద్దకు చేరుకున్న కార్యకర్తలు పబ్బులను మూసివేయాలంటూ నినాదాలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద బఫెల్లో వైల్డ్ వింగ్స్, స్పోస్కై రెండు పబ్బులు అర్ధరాత్రి 12 గంటలు దాటినా తెరిచి ఉన్నాయని ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరి వెంకట్ మండిపడ్డారు.
ఒక పక్క పబ్బుల్లో మద్యం సేవించి కొందరు మైనర్లపై ఇష్టారీతిన అత్యాచారాలు చేస్తుంటే మరో వైపు నిబంధనలు పాటించని కొందరు పబ్బు యాజమాన్యాలు 24 గంటలు.. పబ్బులను తెరిచి ఉంచుతున్నారని బల్మూరి వెంకట్ ధ్వజమెత్తారు. ప్రభుత్వం ఈ తరహా పబ్బులను వెంటనే మూసివేయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక దశలో పబ్బు నిర్వాహకులకు, వెంకట్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
'ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం పబ్‌లపై చర్యలు తీసుకుంటున్మామని చూపిస్తూ అర్థరాత్రి 1 గంట వరకు అక్కడ పర్మిషన్ ఉంటది. ఆ తర్వాత పబ్ యజమానులకు, ప్రభుత్వానికి ఎలాంటి ఒప్పందం ఉంటదో తెలియదు. ఏం లాభాదేవీలుంటాయో కానీ... 24 గంటలు వీళ్లకి పర్మిషన్ ఇవ్వడంతో విచ్చలవిడిగా తాగుతారు. ఆ తర్వాత జరిగే పరిణామాలకు బాధ్యులు ఎవరు? తాాజాగా జూబ్లీహిల్స్ పబ్ కేసులో సాక్ష్యాధారాలు సీసీ కెమెరాల ద్వారా తెలిశాయి. కానీ ఇక్కడ ఏమైనా జరిగితే బయటకి వచ్చే పరిస్థితి లేదు. అయితే ప్రభుత్వం వీటికి ఏ రకంగా పర్మిషన్ ఇచ్చిందో ప్రభుత్వం చెప్పాలి? 24 గంటలు లిక్కర్ సరఫరా చేసుకోవచ్చని పర్మిషన్ ఇచ్చిందా ? ఇస్తే దానికి ఏమేమి గైడ్‌లైన్స్ ఉన్నాయో స్పష్టత ఇవ్వాలి. ఈ పబ్‌లపై కఠినమైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో దీనిపైన పెద్ద కార్యక్రమాలు చేపడుతాం.'-బల్మూరి వెంకట్, ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
12 దాటినా మూతపడని పబ్బులు.. ఆందోళనకు దిగిన ఎన్‌ఎస్‌యుఐ కార్యకర్తలు ఇవీ చదవండి:తెలిసిన వారే బరితెగిస్తున్నారు.. అమ్మాయిలూ.. పారాహుషార్..!