విద్యుత్ ఉద్యోగులు అత్యవసర సేవల కిందకు వస్తారని.. వారిని విధులకు వెళ్లకుండా అడ్డుకోవద్దని ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాల్రావు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సిరిసిల్లలో ఉన్న విద్యుత్ స్తంభాల తయారీ కేంద్రం నుంచి మంచిర్యాలకు వయా.. వేములవాడ, జగిత్యాల మీదుగా వెళ్తున్న స్తంభాల లోడ్ లారీని.. వేములవాడ గుట్ట, నల్గొండ గ్రామ చెక్పోస్ట్, జగిత్యాల బైపాస్ వద్ద పోలీసులు ఆపిన విషయాన్ని సిబ్బంది తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. లాక్డౌన్ సమయంలో బయటకు రావొద్దని హెచ్చరించి పంపినట్లు తెలిసిందన్నారు. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన ఆవాసాల విద్యుదీకరణ పనుల్లో భాగంగా స్తంభాలు తీసుకెళ్తున్న లారీలను ఆపడం సరికాదన్నారు.