తెలంగాణ

telangana

ETV Bharat / city

హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష ఎప్పుడంటే? - హైకోర్టులో ఉద్యోగాలు

Notification for Jobs in High court: తెలంగాణ హైకోర్టు.. టైపిస్ట్, కాపీరైటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆగస్టు 10 నుంచి 25లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చని తెలిపింది. సెప్టెంబరు 5న హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పేర్కొంది.

హైకోర్టు
highcourt

By

Published : Jul 27, 2022, 9:54 AM IST

Notification for Jobs in High court: 43 టైపిస్ట్‌, 42 కాపీరైటర్‌ పోస్టుల భర్తీకి హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆగస్టు 10 నుంచి 25లోగా దరఖాస్తులను ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించవచ్చని, సెప్టెంబరు 5న హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది. సెప్టెంబరు 25న రాత పరీక్ష ఉంటుందని పేర్కొంది.

18 నుంచి 34 ఏళ్ల వయసుండి డిగ్రీతోపాటు టైప్‌రైటింగ్‌లో హయ్యర్‌ ఉత్తీర్ణత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులను హైకోర్టు వెబ్‌సైట్‌లో ఉంచినట్లు వెల్లడించింది. పూర్తి వివరాలు, నియామక విధానాన్ని నోటిఫికేషన్‌లో పేర్కొంది.

ABOUT THE AUTHOR

...view details