కేరళలో మరో కొత్త వైరస్ వెలుగు చూసింది. నోరో వైరస్‌గా(norovirus transmission) పిలుస్తున్న ఈ వ్యాధి.. రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకింది. వీరందరూ వయనాడ్ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులని సమాచారం(kerala virus outbreak). వాంతులు, డయేరియాను ఈ వైరస్(norovirus 2021) లక్షణాలుగా గుర్తించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.
నోరో వైరస్ అనేది అరుదైన వ్యాధి. కళాశాల క్యాంపస్ బయట ఉండే హాస్టళ్లల్లోని విద్యార్థుల్లో తొలిసారి ఈ వైరస్‌ను గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. వారి రక్తనమూనాలను సేకరించి అలప్పుజలోని జాతీయ వైరాలజీ సంస్థ(ఎన్ఐవీ)కి పంపించారు.