వరణుడి బీభత్సానికి వణుకుతున్న తెలంగాణ Telangana Rains Today : తెలంగాణ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండటం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర తెలంగాణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వాన పడుతోంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తోంది. ఉదయాన్నే కార్యాలయాలు, ఇతర పనులకు వెళ్లే వారు వానలో తడిసిముద్దయ్యారు. నాచారం, మల్లాపూర్, తార్నాక, లాలాపేట్, ఓయూ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో చలిగాలులతో కూడి వర్షం వస్తోంది.
భాగ్యనగరం గజగజ
Rain in Telangana Today : ఇప్పటికే చలికి గజగజ వణుకుతున్న భాగ్యగర ప్రజలను మూడ్రోజులుగా వరణుడు గడగడలాడిస్తున్నాడు. ఇవాళ ఉదయం నుంచి కురుస్తున్న ఎడతెరిపిలేని వానతో నగర ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పనుల నిమిత్తం బయటకు రావడానికి అవస్థలు పడుతున్నారు. బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్‌బాగ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, లక్డీ కా పూల్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో వాహనదారులు తడిసిపోయారు. రహదారులపైకి నీరు చేరడం వల్ల ఇబ్బందులు పడ్డారు.
24 గంటల్లో.. 2 సెంటీ మీటర్ల వాన..
Rains in Winter at Telangana : గత 24 గంటల్లో.. మల్కాజిగిరి, జీడిమెట్ల, గచ్చిబౌలి సెంట్రల్ యూనివర్సిటీ, షేక్‌పేట్, సరూర్‌నగర్, ఏఎస్ రావు నగర్, మాదాపూర్, హయత్‌నగర్, తిరుమలగిరిలో రెండు సెంటిమీటర్ల వాన కురిసిందని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ వెల్లడించింది.
చిరుజల్లులు..
Winter Rains in Telangana : హైదరాబాద్, సికింద్రాబాద్‌లో పలు చోట్ల వర్షం పడుతోంది. చార్మినార్, చాంద్రాయణగుట్ట, బహదూర్‌పురా, యాకుత్‌పురా, ఖైరతాబాద్ రాజేంద్రనగర్, అత్తాపూర్, కిస్మత్‌పురా, బండ్లగూడ, గండిపేట్, శంషాబాద్, నాచారం, మల్లాపూర్, హబ్సిగూడ, తార్నాక, ఓయూ క్యాంపస్, చిలకలగూడ, లాలాగూడ, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, బేగంపేట, తిరుమలగిరి, అల్వాల్, బోయిన్‌పల్లి ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి.
పంటలు నీటిపాలు..
Telangana Weather Updates : పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షానికి వృక్షాలు నేలరాలుతున్నాయి. మరి కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలిపోయి కరెంట్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది. కొద్దిరోజుల క్రితమే నాట్లు వేసిన రైతులు.. తమ పొలాలను వరద ముంచెత్తుతోందని వాపోతున్నారు. మరోవైపు పత్తి, మిరప రైతులు తమ పంటంతా నీటిపాలవుతోందని ఆవేదన చెందుతున్నారు.