ఈ నెల 21లోపు గాంధీలో నాన్ కొవిడ్ సేవల ప్రారంభం - గాంధీ ఆసుపత్రిలో వైద్య సేవలు పునః ప్రారంభం
18:14 November 12
ఈ నెల 21లోపు గాంధీలో నాన్ కొవిడ్ సేవల ప్రారంభం
గాంధీ ఆసుపత్రిలో నాన్ కొవిడ్ వైద్య సేవలు పునఃప్రారంభించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 21లోపు సాధారణ వైద్య సేవలు మళ్లీ ప్రారంభించాలని సూచించారు. కొవిడ్, నాన్ కొవిడ్ రోగుల కోసం తక్షణమే వేర్వేరు ప్రాంతాలు కేటాయించాలని మార్గదర్శకాలు జారీ చేశారు. గతంలో ఉన్న అన్ని రకాల వైద్య సేవలు కొనసాగించాలని తెలిపారు. రోగుల సంఖ్యకు అనుగుణంగా వైద్య సిబ్బందిని కేటాయించాలని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:రేపు సాయంత్రం రాష్ట్ర మంత్రి వర్గ సమావేశం