తెలంగాణ

telangana

ETV Bharat / city

JAGAN ED CASE : వెంకట్రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్ - Investigation of Jagan piracy cases

ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు మాజీ అధికారులపై సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంకట్రామిరెడ్డిపై, ఓఎంసీ కేసులో విచారణకు హాజరుకానందున రాజగోపాల్​పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.

JAGAN ED CASE : వెంకట్రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్
JAGAN ED CASE : వెంకట్రామిరెడ్డిపై నాన్ బెయిలబుల్ వారెంట్

By

Published : Sep 16, 2021, 11:22 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో ఇద్దరు మాజీ అధికారులపై సీబీఐ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. విశ్రాంత ఐఏఎస్ జి.వెంకట్రామిరెడ్డి, గనులశాఖ విశ్రాంత సంచాలకుడు వి.డి.రాజగోపాల్‌పై ఎన్‌బీడబ్ల్యూ జారీ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. రాంకీ కేసులో విచారణకు హాజరుకాని జి.వెంకట్రామిరెడ్డిపై, ఓఎంసీ కేసులో విచారణకు హాజరుకానందున రాజగోపాల్​పై ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సీబీఐ కోర్టు వెల్లడించింది.

రాంకీ ఈడీ కేసులో జగన్, విజయసాయి డిశ్చార్జ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసుల నుంచి తొలగించాలని జగన్, విజయసాయి కోరారు. ఈ కేసు విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. జగతి పబ్లికేషన్స్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కేసు విచారణ జరిగింది.

ఈడీ కేసుల విచారణపై సుప్రీంకు వెళ్తామన్న విజయసాయిరెడ్డి అభ్యర్థనపై ఈడీ మరోసారి అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టే లేనందున విచారణకు షెడ్యూలు ఖరారు చేయాలని ఈడీ ఆదేశించింది. జగతి పబ్లికేషన్స్‌పై ఈడీ కేసు విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది. ఓఎంసీ కేసులో లిఖితపూర్వక వాదనలకు సీబీఐ కోర్టు సమయం కోరింది. ఓబుళాపురం గనుల కేసు విచారణ ఈనెల 30కి వాయిదా వేసింది.

ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరణ..

ఓఎంసీ కేసులో రాజగోపాల్‌పై సీబీఐ కోర్టు ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించింది. ఎన్‌బీడబ్ల్యూ జారీ అయ్యాక వి.డి. రాజగోపాల్ సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. రూ.5వేల వ్యక్తిగత పూచీకత్తుతో కోర్టు ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించింది.

ఇదీ చదవండి:Ts Cabinet: ముగిసిన కేబినెట్ భేటీ... సబ్ కమిటీల ఏర్పాటుతో పాటు కీలక నిర్ణయాలకు ఆమోదం

ABOUT THE AUTHOR

...view details