తెలంగాణ

telangana

By

Published : Nov 2, 2020, 10:16 AM IST

ETV Bharat / city

‘అమరావతి’ ఆందోళనకారులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు

జైల్ భరో కార్యక్రమంలో అరెస్టైన వారిపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేశారు. ఏపీలోని గుంటూరులో శనివారం ఆందోళన చేసిన 122 మందిపై కొవిడ్‌ మార్గదర్శకాలు, సెక్షన్‌ 144 నిబంధనల్ని అతిక్రమించారంటూ కేసులు నమోదు చేశారు.

‘అమరావతి’ ఆందోళనకారులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు
‘అమరావతి’ ఆందోళనకారులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు

రైతులకు సంకెళ్లు వేయటాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్​లోని గుంటూరులో శనివారం ఆందోళన చేసిన 122 మందిపై కొవిడ్‌ మార్గదర్శకాలు, సెక్షన్‌ 144 నిబంధనల్ని అతిక్రమించారంటూ... అరండల్‌పేట స్టేషన్‌లో రెండు కేసులు నమోదయ్యాయి. అమరావతి రైతు ఐకాస, దళిత రైతు ఐకాస, రాజకీయేతర ఐకాస నేతలతో పాటు తెదేపా, సీపీఐ, పలు ప్రజా సంఘాల నాయకులపై కేసులు పెట్టారు.

మహిళా ఐకాస కన్వీనర్‌ రాయపాటి శైలజతోపాటు పి.మల్లికార్జునరావు, గోపాలకృష్ణ, చుక్కపల్లి రమేష్‌, ముప్పాళ్ల నాగేశ్వరరావు, పువ్వాడ సుధాకర్‌, మార్టిన్‌ లూధర్‌, కోటా మాల్యాద్రి, జంగాల చైతన్య, షేక్‌ వలి, మనోజ్‌ సహా 99 మందిపై 341, 186, 188, 269 నాన్‌ బెయిలబుల్‌ సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టారు. మరో 23 మందిపై 151 సీఆర్‌పీ కింద కేసు నమోదు చేశారు. జైలు ఆవరణలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించారని గుర్తించి శైలజను ఏ1గా పేర్కొన్నారు.

ఇదీ చదవండి:హెలికాఫ్టర్​లో గ్రామస్థుల చక్కర్లు

ABOUT THE AUTHOR

...view details