పుర ఎన్నికల మొదటి ఘట్టం నామినేషన్ల దాఖలుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోటీ చేసే అభ్యర్థులు మొదటి రోజే ఉత్సాహంగా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ కార్యాలయాల్లోకి కేవలం అభ్యర్థులను మాత్రమే అనుమతిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఉదయమే నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం
పురపాలక ఎన్నికల్లో నామినేషన్ల దాఖలుకు ఎన్నికల యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది.
నామినేషన్ కేంద్రాల వద్ద సందడి వాతావరణం
రాష్ట్ర ఎన్నికల సంఘం నామినేషన్ల స్వీకరణకు మూడు రోజుల గడువు విధించింది. 11న నామినేషన్లు పరిశీలించనున్నారు. తిరస్కరించిన నామినేషన్లపై అప్పీలు దాఖలు చేసుకునేందుకు 12వ తేదీని కేటాయించింది ఎస్ఈసీ. 14న నామినేషన్ల ఉపసంహరణ, అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు. జనవరి 22న 120 పురపాలక సంఘాలకు, 10కార్పొరేష్లకు ఎన్నికలు జరగనున్నాయి.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ
Last Updated : Jan 8, 2020, 2:40 PM IST