తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ పంచాయతీ పోరు: జోరుగా రెండో విడత నామినేషన్లు - ap local bodies

ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో విడత నామినేషన్ల ప్రక్రియ తొలిరోజే జోరుగా సాగింది. అభ్యర్థులు ఉత్సాహంగా నామపత్రాలను సమర్పించారు. సర్పంచ్, వార్డు స్థానాలకు కలిపి తొలిరోజు 7వేల 170 నామినేషన్లు దాఖలయ్యాయి.

nominations-continues-for-the-second-phase-of-elections-for-ap-local-bodies
ఏపీ పంచాయతీ పోరు

By

Published : Feb 3, 2021, 7:29 AM IST

ఏపీలోని 13 జిల్లాల్లోని 3,335 పంచాయతీలు, 33,632 వార్డుల్లో జరిగే రెండో విడత పల్లె పోరుకు నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. తొలిరోజు సర్పంచ్‌ స్థానాలకు 2 ,619 నామినేషన్లు, వార్డు సభ్యుల స్థానాలకు 6,561 నామపత్రాలు దాఖలు చేశారు. ప్రకాశం జిల్లాలో 65 సర్పంచి ,168 వార్డు పదవులకు నామినేషన్లు వేశారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లో సర్పంచ్ స్థానాలకు 175 , వార్డు స్థానాలకు 371 మంది నామినేషన్లు వేశారు. గుంటూరు జిల్లా నరసరావుపేట డివిజన్‌లో మొత్తం 115 నామపత్రాలు అందాయని అధికారులు వెల్లడించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌లో సర్పంచ్‌ స్థానాలకు 184 నామినేషన్లు దాఖలయ్యాయి.

కడప జిల్లాలో తొలిరోజు కొన్నిచోట్ల నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు ముందుకు రాలేదు. విజయనగరం జిల్లా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, గరుగుబిల్లి, సాలూరు మండలాల్లో అభ్యర్థులు హుషారుగా నామినేషన్లు దాఖలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు పరిధిలో 371 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్నిచోట్ల ఒక్క నామినేషన్ దాఖలు కాలేదు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు, అనపర్తిలో జోరుగా నామపత్రాలు దాఖలు చేశారు. విశాఖ జిల్లాలో రెండో విడత ఎన్నికల ప్రక్రియ మందకొడిగా ప్రారంభమైంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని 188 చోట్ల ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.

ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్‌ కేంద్రాలను జిల్లా అధికారులు పరిశీలించారు. కృష్ణా జిల్లా పామర్రులో పర్యటించిన కలెక్టర్‌ ఇంతియాజ్‌.. అధికారులకు సూచనలు చేశారు. కర్నూలు జిల్లాలో విధులకు గైర్హాజరైన 59 మంది సిబ్బందికి అధికారులు షోకాజ్ నోటీసులు జారీచేశారు.

ABOUT THE AUTHOR

...view details