తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు - new nominated mlcs oathing program

గవర్నర్ కోటాలో నామినేటైన ముగ్గురు ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించారు.

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు
ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు

By

Published : Nov 18, 2020, 12:54 PM IST

ప్రమాణ స్వీకారం చేసిన కొత్త​ ఎమ్మెల్సీలు

నూతనంగా ఎంపికైన ముగ్గురు నామినేటెడ్​ ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్​ కోటాలో ఎమ్మెల్సీలుగా నామినేటైన గోరటి వెంకన్న, బస్వరాజు సారయ్య, బొగ్గారపు దయానంద్​... ముందుగా గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి... తన ఛాంబర్​లో ప్రమాణం చేయించారు. మంత్రులు ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు ప్రమాణ స్వీకారానికి హాజరై కొత్త ఎమ్మెల్సీలకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇదీ చూడండి: పెద్దల సభకు వెళ్తున్న ఈ ముగ్గురి నేపథ్యం తెలుసా...?

ABOUT THE AUTHOR

...view details