తిరుమలలో ఈ నెల 13, 14, 15న వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు (VIP Break Darshan cancelled at tirumala news). ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఓ ప్రకటన విడుదల చేసింది. 12, 13, 14 తేదీల్లో సిఫారసు లేఖలు తీసుకోబోమని స్పష్టం చేసింది. తిరుపతిలో ఈ నెల 14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనుంది. హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. ఇందులో పాల్గొనేందుకు ఏపీ, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కర్ణాటక ముఖ్యమంత్రులు రానున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే వెల్లడించింది.
No VIP break darshan at TTD: ఆ మూడురోజులు తిరుమల శ్రీవారి వీఐపీ దర్శనాలు రద్దు
16:43 November 06
దక్షిణాది సీఎంల సమావేశం.. తిరుమలలో ఆ మూడురోజులు బ్రేక్ దర్శనాలు రద్దు
ఈ నెల 14న తిరుపతిలో సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరగనున్న సందర్భంగా.. ఏపీ ముఖ్యమంత్రి జగన్ గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలనే అంశాన్ని దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశంలో ప్రస్తావించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డు పరిధిలోకి జూరాల ప్రాజెక్టును తీసుకురావాలనే విషయాన్ని ఆ సమావేశంలో చర్చకు పెట్టాలని తీర్మానించింది.
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా అధ్యక్షతన ఈనెల 14న తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణాది రాష్ట్రాల భేటీలో చర్చించాల్సిన అంశాలపై వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలో బుధవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఇదీ చదవండి :దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ ఎజెండాపై కృష్ణాబోర్డుకు లేఖ