తెలంగాణ

telangana

ETV Bharat / city

'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు అవసరం లేదు' - రాయలసీమ ప్రాజెక్టు వార్తలు

రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి కేంద్రం అఫిడవిట్ సమర్పించింది. కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం లేనందున కొత్త ప్రాజెక్టుగా పరిగణించలేమని స్పష్టం చేసింది. రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు వేర్వేరుగా గతంలోనే అనుమతులు తీసుకున్నారని కేంద్రం వివరణ ఇచ్చింది.

ngt
ngt

By

Published : Aug 29, 2020, 8:39 AM IST

రాయలసీమ ఎత్తిపోతలకు ముందస్తు పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీకి అఫిడవిట్ సమర్పించింది. రాయలసీమ ప్రాజెక్టు కొత్తది కాదని, అదనపు నీటి వినియోగం లేదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలోని ప్రాజెక్టులకు ఫీడ్​గా మాత్రమే ఎత్తిపోతల పనిచేస్తుందని ఎన్జీటీకి కేంద్రం వివరణ ఇచ్చింది. కొత్త ఆయకట్టు సాగులోకి వచ్చే అవకాశం లేనందున కొత్త ప్రాజెక్టుగా పరిగణించలేమని స్పష్టం చేసింది.

రాయలసీమ పరిధిలోని ప్రాజెక్టులకు వేర్వేరుగా గతంలోనే అనుమతులు తీసుకున్నారని కేంద్రం వివరణ ఇచ్చింది. తెలుగుగంగ, గాలేరు-నగరికి పర్యావరణ అనుమతులు ఉన్నాయని వెల్లడించింది. శ్రీశైలం కుడికాలువ పనులకు అనుమతులున్నట్లు పర్యవరణ మంత్రిత్వశాఖ పేర్కొంది. పర్యవరణ నిబంధనలను ఉల్లంఘించటం లేదని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. నీటి మీటర్ల ఏర్పాటుకు కృష్ణా జలవివాదాల ట్రైబ్యునల్ ఆదేశించిందని వివరించింది. నీటి మీటర్ల ఏర్పాటును కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పర్యవేక్షిస్తోందని వివరణ ఇచ్చింది.

ఇదీ చదవండి:'రాయలసీమ ఎత్తిపోతల సామర్థ్యం పెంచితే తెలంగాణకు తీవ్ర నష్టం'

ABOUT THE AUTHOR

...view details