హైదరాబాద్‌లోనే నెంబర్ వన్ పోలీస్ స్టేషన్‌గా పేరు గాంచిన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ రెండురోజులు చీకట్లో గడిపింది. భారీ వర్షాల కారణంగా గత 48 గంటలుగా పోలీస్ స్టేషన్‌కి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దేశంలోనే అత్యంత సేవలందించే రెండవ పోలీస్ స్టేషన్‌గా పేరు దక్కించుకున్న పంజాగుట్ట పోలీస్ విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల స్టేషన్ సిబ్బంది ఇబ్బందులకు గురయ్యారు.
పంజాగుట్ట పీఎస్‌కు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా - హైదరాబాద్ వార్తలు
దేశంలోనే ఎక్కువ కేసులు నమోదు చేసి.. ఎక్కువ సమస్యలు పరిష్కరించే పోలీస్ స్టేషన్‌గా పేరు దక్కించుకున్న పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు భారీ వర్షం కారణంగా రెండు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 24 గంటలు ప్రజలకు సేవలందించే పోలీస్ స్టేషన్‌కు విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల.. సేవల విషయంలో అంతరాయం ఏర్పడింది.
పంజాగుట్ట పీఎస్‌కు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
సోమవారం నుంచి.. మంగళవారం సాయంత్రం వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 24 గంటలు సేవలందించే పోలీస్ స్టేషన్‌కే విద్యుత్ నిలిచిపోవడం వల్ల.. పోలీసులు సైతం ఇబ్బంది పడ్డారు. సేవలకు అంతరాయం కలిగింది.
ఇవీచూడండి:రాజకీయాలు తగవు.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలి: కిషన్ రెడ్డి