తెలంగాణ

telangana

ETV Bharat / city

No permission for Jung Siren Rally : ర్యాలీకి అనుమతిలేదు.. అడ్డుకుంటే సహించేది లేదు

గాంధీ జయంతి సందర్భంగా జంగ్ సైరన్​ పేరుతో శాంతియుత నిరసన తెలుపుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఆ ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్​ స్పష్టం చేశారు. పోలీసులు సహకరించినా లేకపోయినా.. ర్యాలీ చేసి తీరతామని రేవంత్ తేల్చిచెప్పారు. ఈ కార్యక్రమంలో.. కార్యకర్తలకు లాఠీ దెబ్బతగలకుండా.. తూటా తగలకుండా అడ్డుగా నిలుస్తానని భరోసానిచ్చారు.

No permission for Jung Siren Rally
No permission for Jung Siren Rally

By

Published : Oct 2, 2021, 12:36 PM IST

Updated : Oct 2, 2021, 2:55 PM IST

గాంధీ జయంతి (gandhi jayanthi 2021) సందర్భంగా రాష్ట్రంలో శాంతియుత నిరసనలు తెలుపుతామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC Chief revanth reddy) అన్నారు. విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్ (No permission for Jung Siren Rally) పేరుతో నిరసన చేస్తామని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టనున్న జంగ్ సైరన్ ర్యాలీ (No permission for Jung Siren Rally)కి అనుమతి లేదని రాచకొండ సీపీ మహేశ్ భగవత్(Rachakonda Cp mahesh bhagwat) స్పష్టం చేశారు. దిల్​సుఖ్​నగర్​ నుంచి ఎల్బీనగర్​ వరకు ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని తేల్చిచెప్పారు.

నిరుద్యోగ యువత, విద్యార్థి సమస్యలపై జంగ్ సైరన్(No permission for Jung Siren Rally) పేరుతో దిల్​సుఖ్​నగర్​ నుంచి ఎల్బీనగర్​ శ్రీకాంతాచారి విగ్రహం వరకు కాంగ్రెస్ ర్యాలీ(No permission for Jung Siren Rally) ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు చేపట్టనున్నట్లు రేవంత్ రెడ్డి(TPCC Chief revanth reddy) ప్రకటించారు. ఈ ర్యాలీకి విద్యార్థులు, నిరుద్యోగులు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. జంగ్ సైరన్ ర్యాలీ(No permission for Jung Siren Rally) ప్రశాంతంగా జరిగేలా పోలీసులు సహకరించాలని రేవంత్ కోరారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు.

"జంగ్ సైరన్(No permission for Jung Siren Rally) ర్యాలీని పోలీసులు అడ్డుకుంటే నేనే ముందుంటా. లాఠీ తగిలినా.. తూటా తగిలినా ముందు నాకే తగులుతుంది. కార్యకర్తలు భయపడాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా జరిగే కార్యక్రమాలను రెచ్చగొట్టొద్దు. కాంగ్రెస్‌ నాయకులను అరెస్టు చేయడం, రాజీవ్‌గాంధీ, మహాత్మాగాంధీ విగ్రహాలను పోలీసులు స్వాధీనం చేసుకోవడాన్ని మేం ఖండిస్తున్నాం. ఎల్బీనగర్‌లో తమ నాయకులను ముందస్తు అరెస్ట్ చేశారని, వారిని తక్షణమే విడుదల చేయాలి. శాంతియుత కార్యక్రమానికి పోలీసులు సహకరించాలి. సహకరించకపోయినా ర్యాలీ(No permission for Jung Siren Rally) చేసి తీరుతాం. ఇదంతా సీఎం కేసీఆర్​కు తెలిసే జరుగుతోందా. తక్షణమే మా ర్యాలీ(No permission for Jung Siren Rally)కి అనుమతి ఇవ్వాలి."

- రేవంత్ రెడ్డి(TPCC Chief revanth reddy), టీపీసీసీ అధ్యక్షుడు

"కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరుగుతున్న ర్యాలీ(No permission for Jung Siren Rally)కి అనుమతి లేదు. ర్యాలీ నిర్వహిస్తే.. నిర్వహించిన వారిపై.. పాల్గొన్న వారిపై చర్యలు తీసుకుంటాం."

- మహేశ్ భగవత్(Rachakonda Cp mahesh bhagwat), రాచకొండ సీపీ

Last Updated : Oct 2, 2021, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details