ఏపీ విశాఖ మన్యంలోని లంబసింగిలో చలికాలంలో ఉష్ణోగ్రతలు సుమారు 5 డిగ్రీలకు పడిపోతాయి. 2019లో అత్యల్పంగా 2.5 డిగ్రీలు కూడా నమోదైంది. చలితో పాటు పొగమంచు అందాలు పర్యటకులను కట్టిపడేస్తాయి. ఎత్తైన కొండపై ఉన్న చెరువులవెనం ఆదివాసీ గ్రామం ప్రత్యేక వ్యూపాయింట్‌గా ప్రాచుర్యం పొందింది. ఇదివరకు పండుగలు, వారాంతపు సెలవు రోజుల్లోనే సందర్శకుల తాకిడి ఉండేది. క్రమంగా సాధారణ రోజుల్లోనూ వీరి సంఖ్య పెరుగుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచీ ఏటా 70వేల మంది ఇక్కడికి వస్తుంటారు. ఎంతో ఆశతో వచ్చే పర్యటకులను ఇక్కడి సౌకర్యాలు నిరుత్సాహ పరుస్తున్నాయి. కనీస సదుపాయాలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
వెళ్లేందుకు, ఉండేందుకూ సమస్యే
వారాంతపు రోజుల్లో లంబసింగి, వంజంగి ప్రాంతాల్లో పొగమంచుతో నిండిన కొండలను చూడడానికి వచ్చే పర్యటకులతో ఘాట్ రోడ్డు కిటకిటలాడుతుంటుంది. వాహనాల రద్దీని నియంత్రించే వారు లేక ట్రాఫిక్‌లో ఇరుక్కుంటున్నారు. తీరా పర్యాటక ప్రాంతానికి చేరుకున్నాక వసతి సమస్య వేధిస్తోంది. లంబసింగిలో రూ.5 కోట్లతో నిర్మించిన రిసార్టులు మూడేళ్లుగా అసంపూర్తిగానే ఉన్నాయి. ప్రైవేటు గుడారాలు నిర్వహించేవారు అడ్డగోలుగా దోచేస్తున్నారు.
ఆపద వస్తే అంతే..