ఏపీలోని అనంతపురం జిల్లా మడకశిర మండలం దిగువ రామగిరి, భీమరాయనపల్లి, అచ్యుతరాయన పల్లి గ్రామాలు కరోనా కట్టడిలో ఆదర్శంగా నిలుస్తున్నాయి. రెండో దశలో ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు ఒక్క కేసూ నమోదు కాలేదు. ఈ గ్రామాల్లోని ప్రజలు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ కేసులు నమోదు కాకుండా జాగ్రత్త వహించారు. దిగువ రామగిరి గ్రామంలో.. 400మందికి పైగా జనాభా ఉన్నారు.
కరోనా ఫ్రీ విలేజెస్.. నేటికీ ఆ గ్రామాలకు దరిచేరని వైరస్ - corona free villages in anantapuram district
కరోనా మొదటి, రెండో దశల్లో పల్లె మొదలు ప్రపంచ దేశాలకు వణుకు పుట్టించింది. ప్రతిరోజు ఎక్కడో ఒక దగ్గర మరణ వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. అనేక రాష్ట్రాలు, నగరాలు, పల్లెలు మహమ్మారితో చిగురుటాకుల్లా వణికిపోతున్నాయి. కానీ ఆ గ్రామాల్లో మాత్రం ఇప్పటికీ ఒక్కటంటే ఒక్క కేసూ నమోదు కాలేదు. ఆ గ్రామాలేవో తెలుసుకోండి.
![కరోనా ఫ్రీ విలేజెస్.. నేటికీ ఆ గ్రామాలకు దరిచేరని వైరస్ no-corona-in-anantapuram-distrcict](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-06:27:59:1623589079-12118804-541-12118804-1623583303540.jpg)
కరోనా ఫ్రీ విలేజెస్.. నేటికీ ఆ గ్రామాలకు దరిచేరని వైరస్
బయటి వ్యక్తుల్ని గ్రామంలోకి అనుమతించడంలేదు. గ్రామంలో పండించిన పంటలతో ఒకరికొకరు సహకారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీటితో పాటు.. కరోనా నిబంధనలు పాటించడం వల్ల.. వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోగలిగామని గ్రామస్థులు చెబుతున్నారు. కరోనా ఉద్ధృతి తగ్గే వరకు నిబంధనలు పాటిస్తామని అంటున్నారు.
కరోనా ఫ్రీ విలేజెస్.. నేటికీ ఆ గ్రామాలకు దరిచేరని వైరస్
ఇదీ చూడండి:CM KCR REVIEW: పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులతో సీఎం భేటీ