తెలంగాణ

telangana

కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు సభ్యులు.. ఉపాధ్యక్షుడు రామకృష్ణపై మరోసారి అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. మొత్తం 16 మంది సభ్యుల్లో 12 మంది తీర్మానానికి మద్దతు తెలిపినట్లు బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సెప్టెంబర్ నెలలో నిర్వహించిన అవిశ్వాస తీర్మానంలో సాంకేతిక లోపాల వల్ల తిరిగి నిర్వహించాలని కోర్టు తెలిపింది. అందువల్ల తాజాగా తీర్మానాన్నిమరోసారి ప్రవేశపెట్టారు.

By

Published : Dec 19, 2020, 3:59 PM IST

Published : Dec 19, 2020, 3:59 PM IST

no confidence motion on cantonment vice president ramakrishna
కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షుడిపై అవిశ్వాస తీర్మానం

సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఉపాధ్యక్షులు రామకృష్ణపై పాలకమండలి సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని మరోసారి ప్రవేశపెట్టారు. రక్షణశాఖ కార్యాలయంలో ఆర్మీ అధికారులు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. సెప్టెంబర్ నెలలో జరిగిన అవిశ్వాస తీర్మానంలో సాంకేతిక లోపాల మూలంగా తిరిగి నిర్వహించాలని కోర్టు తెలిపిన నేపథ్యంలో.. మళ్లీ ప్రవేశపెట్టినట్లు బోర్డు సభ్యుడు జక్కుల మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. 16 మంది సభ్యుల్లో 12 మంది తీర్మానానికి మద్దతు తెలిపినట్లు ఆయన పేర్కొన్నారు.

ఇకపై రామకృష్ణ కంటోన్మెంట్ ఉపాధ్యక్షుడుగా కొనసాగడని మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. త్వరలోనే ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక ఉంటుందని ఆయన తెలిపారు. రామకృష్ణపై అవిశ్వాస తీర్మానం నెగ్గడం తెరాస విజయమన్నారు. దిల్లీ వెళ్లి రామకృష్ణ మంతనాలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.

ఇదీ చూడండి:గోల్డెన్​ హవర్​లో అత్యవసర వైద్యానికి చర్యలు: సీఎస్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details