విశాఖపట్నం సముద్ర తీరంలో అయోమయ స్థితి కొనసాగుతోంది. అమోనియం నైట్రేట్ నిల్వలతో తీరానికి చేరుకున్న 3 నౌకలు.. ఇందుకు కారణమయ్యాయి. ఈ నెల 29న మరో నౌక సైతం విశాఖ తీరానికి చేరుకోనుంది. ఇక్కడి వరకూ బానే ఉంది కానీ.. నౌకల నుంచి అమోనియం నైట్రేట్ ను దిగుమతి చేయడానికే ఇబ్బందులు ఎదురవుతున్నాయి
విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమతిపై అయోమయం!
విశాఖ తీరం నుంచి అమోనియం నైట్రేట్ దిగుమతిపై సందిగ్దం వీడడం లేదు. ఇప్పటికే 3 నౌకలు ఈ రసాయనంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగరు వేసుకుని కూర్చున్నాయి. మరో నౌక ఈ నెల ఆఖరు వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు... అమోనియం నైట్రేట్ దిగుమతి, స్టోరేజి చేసే శ్రావణ్ షిప్పింగ్ నిబంధనల ఉల్లంఘన కారణంగా ఎన్‌ఓసీని పోలీసులు రద్దుచేశారు.
విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమతిపై అయోమయం!
అమోనియం నైట్రేట్‌ను హ్యాండ్లింగ్ చేసే శ్రావణ్ షిప్పింగ్‌కు ఎన్‌ఓసీని నగర పోలీసు కమిషనరేట్ రద్దు చేసింది. షోకాజ్ నోటీసుకు నిర్ణీత గడువులో సమాధానం ఇవ్వనందున ఎన్‌ఓసీని రద్దు చేసినట్లు సీపీ తెలిపారు. మరోవైపు.. ఈ రసాయనాన్ని దిగుమతి చేసే ఏకైక పోర్టు విశాఖే అయిన కారణంగా.. ఎరువులు, మైనింగ్ పరిశ్రమలు.. ఆశలు పెట్టుకున్నాయి.
ఇదీ చదవండి:ఉన్నదంతా ఊడ్చేస్తున్న కరోనా.. ఆర్థికంగా చితికిన బాధితులు