తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఏపీలో అరగంటలో బెడ్ ఎక్కడా దొరకట్లేదు'

ఏపీలో కొవిడ్‌ నిర్థరణ జరిగిన అరగంటలో ఏ ఆసుపత్రిలోనూ పడకలు దొరకట్లేదని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ బాబూరావు తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్‌ కేసుల సంఖ్యకు రెట్టింపు కేసులు ఉండే అవకాశముందని అన్నారు.

'రాష్ట్రంలో అరగంటలో బెడ్ ఎక్కడా దొరకట్లేదు'
'రాష్ట్రంలో అరగంటలో బెడ్ ఎక్కడా దొరకట్లేదు'

By

Published : Aug 14, 2020, 12:43 PM IST

ఏపీ ముఖ్యమంత్రి చెప్పినట్లుగా కొవిడ్‌ నిర్థరణ జరిగిన అరగంటలో ఏ ఆసుపత్రిలోనూ పడకలు దొరకట్లేదని ఆంధ్రప్రదేశ్‌ పట్టణ పౌర సమాఖ్య కన్వీనర్‌ బాబూరావు తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రకటించిన కొవిడ్‌ కేసుల సంఖ్యకు రెట్టింపు కేసులు ఉండే అవకాశముందని, చాలామంది లక్షణాలున్నా చెప్పకుండా ఇళ్లవద్దే ఉండి తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.

సమాఖ్య ఆధ్వర్యంలో రాష్ట్రంలో ‘'కరోనా- ప్రజారోగ్యం- ప్రభుత్వవైద్యం- కార్పొరేట్‌ ఆసుపత్రుల తీరు’' అనే అంశంపై సర్వే నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆ నివేదిక వివరాలను విజయవాడలో విలేకర్లకు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 520 మంది కొవిడ్‌ రోగులను, వారి కుటుంబసభ్యులను, 720 మంది ఇతర రోగులను మొత్తం 1,240 మందిని కలిసి వివరాలు సేకరించామన్నారు.

సర్వేలో వెల్లడైన అంశాలు..

  • రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 90,425 ఉండగా.. 14,595 మంది మాత్రమే కొవిడ్‌ ఆసుపత్రుల్లో ఉన్నారు. 25,000 మంది క్వారంటైన్‌ సెంటర్లలో ఉన్నారనుకున్నా.. సుమారు 50,000 మంది ఇళ్ల వద్ద, లేదా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్నారు.
  • కొవిడ్‌ రోగులకు 30 నిమిషాల్లో పడకలు దొరకట్లేదు. 2, 3 రోజులు పడుతోంది. వైద్యులు, సిబ్బంది తగినంతగా లేక చాలామందిని చేర్చుకోవట్లేదు.
  • కొన్నిచోట్ల ఆహారం ఇతర సదుపాయాలపై ఫిర్యాదులున్నాయి.
  • ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకం కింద కొవిడ్‌ చికిత్స చేయట్లేదు. రోజుకు రూ.25-75 వేల వరకు వసూలు చేస్తున్నారు.
  • గత 4 నెలల్లో కొవిడ్‌ కారణంగా ప్రజలకు వైద్యఖర్చులు విపరీతంగా పెరిగాయి. చికిత్స, వైద్య పరీక్షలు, మందులు, పరికరాలు, శానిటైజర్లకు భారీగా ఖర్చయింది. పలువురు పనిదినాలు కోల్పోయారు. ప్రజలపై ఈ నాలుగు నెలల్లో పడిన అదనపు భారం రూ.5,484 కోట్లు.

సూచనలు..

  • ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్ల సంఖ్య పెంచాలి. ఆక్సిజన్‌, ఐసీయూ, వెంటిలేటర్లు పెంచాలి.
  • మైదానాలు, ఖాళీ స్థలాలు, కళ్యాణమండపాలు, పాఠశాలలు, కళాశాలల్లో తాత్కాలికంగా కొవిడ్‌ ఆసుపత్రులు, క్వారంటైన్‌ కేంద్రాలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి.
  • కొవిడ్‌ పరీక్షల ఫలితాలు.. 24 గంటల్లో వచ్చేలా ల్యాబుల సంఖ్య పెంచాలి.
  • కార్పొరేట్‌ ఆసుపత్రుల ఫీజులను నియంత్రించాలి. అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవిడ్‌, ఇతర వ్యాధులకు ఆరోగ్య శ్రీ కింద ఉచిత వైద్యం అందించాలి.

ఇదీ చదవండి..

సింహపురి చిన్నోళ్లు... నెట్టింట హల్​చల్!

ABOUT THE AUTHOR

...view details