యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా నిజాం కళాశాల విద్యార్థుల నిరసన - izam's college students protest against uranium mining
ప్రాణాధారమైన అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని నిజాం కళాశాల విద్యార్థి ఐకాస పిలుపునిచ్చింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా... "సేవ్ నేచర్ - సేవ్ నేషన్" అంటూ నినాదాలు చేస్తూ... కళాశాల ప్రాంగణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు.
ప్రజా జీవనాధారమైన నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల అనుమతి కోసం కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా నిజాం కళాశాల విద్యార్థులు నిరసన ర్యాలీ చేశారు. ఆర్డినెన్స్‌ను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సేవ్ నేచర్ - సేవ్ నేషన్ అంటూ నినాదాలు చేశారు. అడవులను ధ్వంసం చేస్తే మానవ మనుగడ ప్రశ్నార్థకమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం యురేనియం తవ్వకాలకు అనుమతి వెనక్కు తీసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని కోరారు. లేని పక్షంలో విద్యార్థులంతా ఏకమై ఉద్యమిస్తామని హెచ్చరించారు.