లోక్సభలో ఆర్టీసీ కార్మికుల సమ్మె గురించి నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రస్తావించారు. రెండు నెలలుగా కార్మికులు సమ్మె చేసినా... ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించలేదని వెల్లడించారు. సంస్థ నష్టాల్లో ఉందని... దానిని ఎవరూ రక్షించలేరని సీఎం చెప్పారని సభ దృష్టికి తీసుకెళ్లారు. రెండు నెలల తర్వాత మళ్లీ ఆయనే కార్మికులను విధుల్లోకి తీసుకుంటున్నామని ప్రకటించారని చెప్పారు. ఈ నిర్ణయం 15 రోజుల ముందు తీసుకుంటే 38 మంది కార్మికులు చనిపోయేవారు కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల మృతికి ముఖ్యమంత్రే కారణమన్నారు.
ఇంటర్మీడియట్ మూల్యంకనంలో కూడా అనుభవం లేని వారికి కాంట్రాక్టు ఇచ్చి విద్యార్థుల చావుకు కారణమయ్యారని అర్వింద్ ఆరోపించారు.
కార్మికుల మృతికి ముఖ్యమంత్రే కారణం: ధర్మపురి అర్వింద్ - parliament
ఆర్టీసీ కార్మికుల సమ్మెపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ లోక్సభలో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి తీసుకుంటామని 15 రోజుల ముందు ప్రకటించి ఉంటే 38 మంది కార్మికులు బతికి ఉండేవారన్నారు. వారి మృతికి ముఖ్యమంత్రే కారణమని ఆరోపించారు.
కార్మికుల మృతికి ముఖ్యమంత్రే కారణం: ధర్మపురి అర్వింద్
ఇవీ చూడండి: కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన రాష్ట్ర బృందం
Last Updated : Dec 3, 2019, 7:35 PM IST