ప్రతి ఏటా సందడిగా ఉండే బతుకమ్మ పండుగ.. కరోనా వల్ల ఎవరింట్లో వారే జరుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ తెలంగాణ ఆడపడుచులంతా ఉత్సాహంగా బతుకమ్మ పాటలు నెమరువేసుకుంటూ.. పండుగ జరుపుకుంటున్నారని హర్షం వ్యక్తం చేశారు.
గౌరమ్మ దయతో.. కరోనా కనుమరుగవ్వాలి: ఎమ్మెల్సీ కవిత
బతుకమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని, వరదల వల్ల భాగ్యనగర వాసులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగిపోవాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ వీడియో సందేశం విడుదల చేశారు.
రాష్ట్ర ప్రజలకు కవిత బతుకమ్మ శుభాకాంక్షలు
రాష్ట్ర ప్రజలకు సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం విడుదల చేశారు. ఓవైపు కరోనా.. మరోవైపు అకాల వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని.. ఒకరికొకరు అండగా నిలుస్తూ బతుకమ్మ పండుగను పరిపూర్ణం చేసుకోవాలని కోరారు. గౌరమ్మ తల్లి దయతో కరోనా కనుమరుగవ్వాలని, భాగ్యనగర వాసుల ఇక్కట్లు తొలగాలని ఆకాంక్షించారు. వరదలతో నష్టపోయిన వారిని ఆదుకునేందుకు సీఎం కేసీఆర్ తక్షణ సాయంగా రూ.550 కోట్లు విడుదల చేయడం సంతోషకరమని తెలిపారు.