ప్రముఖ గ్రూమింగ్ బ్రాండ్ నివియా మెన్ 'ఒకేసారి ఎక్కువ మంది ముఖాన్ని కడుక్కోవడం' అనే పోటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకుంది. ఈ నెల 23న నిర్వహించిన ఈ పోటీల్లో భారతదేశం నుంచి వందమంది యువకులు పాల్గొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చర్మ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో పోటీలు నిర్వహించినట్టు నివియా మెన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. భారత్ నుంచి వందమంది యువకులు పాల్గొనడం, వరల్డ్ రికార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్న నివియా - ఒకేసారి ఎక్కువ మంది ముఖం కడుక్కోవడం
ప్రముఖ గ్రూమింగ్ బ్రాండ్ నివియా మెన్ నిర్వహించిన 'ఒకేసారి ఎక్కువమంది ముఖాన్ని కడుక్కోవడం' అనే పోటీ... వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డుకెక్కింది. భారతదేశం నుంచి వందమంది యువకులు పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు.

వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ దక్కించుకున్న నివియా