స్టీల్, సిమెంట్ ధరలు పెరగటం పట్ల కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అసహనం వ్యక్తం చేశారు. ఆరు నెలల్లో 55 శాతం స్టీల్ ధరలు పెరగటం మంచి పరిణామం కాదన్నారు. ఉత్పాదకతను తగ్గించి ధరను పెంచడం వల్ల పరిశ్రమలకు దీర్ఘకాల లాభాలపై ప్రభావం చూపుతుందన్నారు. 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థపై అసోచామ్ నిర్వహిస్తోన్న వర్చువల్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు.
స్టీల్, సిమెంట్ ధరలు పెరగటంపై మంత్రి గడ్కరీ అసహనం - కేంద్ర రోడ్లు, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజా వార్తలు
ఆరు నెలల్లో 55 శాతం స్టీల్ ధరలు పెరగటం మంచి పరిణామం కాదని మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ధరను పెంచడం వల్ల పరిశ్రమల లాభాలు ప్రస్తుతం పెరిగినప్పటికీ.. భవిష్యత్లో దాని ప్రభావం కనబడుతుందని వ్యాఖ్యానించారు. సిమెంట్ పరిశ్రమల్లోనూ ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ధరలు ఇలానే పెరిగితే ఫైబర్, మలేషియన్ టెక్నాలజీ లాంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించటంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
కోర్ సెక్టార్ పరిశ్రమలైన వీటిలో 100 శాతం ఉత్పాదకతో పరిమిత స్థాయిలో లాభాలను తీసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ధరలు ఈ స్థాయిలో పెరగటం పరిశ్రమలతోపాటు దేశానికి మంచిది కాదన్నారు. ధరల పెరుగుదల వల్ల ఇన్ఫ్రా, రియల్ ఎస్టేట్లో ప్రాజెక్టులు చేపట్టటం ఆర్థికంగా వీలు కాదని పేర్కొన్నారు. సిమెంట్ పరిశ్రమల్లోనూ ధరల పెరుగుదలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన.. ఏదో ఒక సమయంలో పూర్తి కాంక్రీటు ప్రాజెక్టులను చేపట్టటంపై ఆలోచించాల్సి ఉంటుందని అన్నారు. ధరలు ఇలానే పెరిగితే ఇతర దేశాల్లో వలే ఫైబర్, మలేషియన్ టెక్నాలజీ లాంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించటంపై నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి: వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై కార్యశాల