వ్యవసాయంలో నియంత్రిత విధానం అమలుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. అంసెబ్లీ ప్రశ్నోత్తరాల్లో పామాయిల్ పంటపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. రాష్ట్రంలో కోటీ 45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని మంత్రి పేర్కొన్నారు.
వ్యవసాయంలో పంటల మార్పిడి జరగాలి: మంత్రి నిరంజన్‌రెడ్డి - assembly sessions
రాష్ట్రంలో కోటీ 45 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయంలో పంటల మార్పిడి జరగాలని ఆకాంక్షించారు. పామాయిల్ పంట సాగుతో రైతులకు అన్నిరకాలుగా లాభం చేకూరుతుందని వివరించారు.
niranjanreddy on palm oi crop in telangana
గతేడాది దేశంలో తెలంగాణ నుంచే 55 శాతం వరి ధాన్యం అందించినట్లు తెలిపిన మంత్రి... వ్యవసాయంలో పంటల మార్పిడి జరగాలని ఆకాంక్షించారు. దేశంలో నూనె గింజల ఉత్పత్తి పడిపోయిందన్నారు. వంట నూనెల వినియోగం బాగా పెరిగిందన్న మంత్రి... పామాయిల్ పంట సాగుతో రైతులకు అన్నిరకాలుగా లాభం చేకూరుతుందని వివరించారు. పంటమార్పిడి జరగటమే కాకుండా... కోతులబెడద, ప్రకృతి వైపరిత్యాల వల్ల ఎలాంటి నష్టం ఉండదని తెలిపారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో లక్షన్నర దాటిన కరోనా కేసులు... 927 మంది మృతి