తెలంగాణ

telangana

ETV Bharat / city

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు.. సురక్షితంగా బయటకొచ్చాడు - ఏలూరులో బోరుబావిలో పడ్డ బాలుడు

Boy fell in Borewell: ఏపీలోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో బోరుబావిలో పడిన 9 ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామానికి చెందిన పూర్ణ జశ్వంత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పూడిపోయిన బోరుబావిలో పడిపోగా.. 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకున్నాడు.

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు.. సురక్షితంగా బయటకొచ్చాడు
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు.. సురక్షితంగా బయటకొచ్చాడు

By

Published : Jul 7, 2022, 12:54 PM IST

ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు.. సురక్షితంగా బయటకొచ్చాడు

Boy fell in Borewell: ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుండుగోలనుగుంటలో బోరుబావిలో పడిన 9ఏళ్ల బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. గ్రామానికి చెందిన పూర్ణ జశ్వంత్ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు 400 అడుగుల లోతు గల బోరుబావిలో పడిపోయాడు. అయితే బాలుడు 30 అడుగుల లోతులో రాయిపై చిక్కుకున్నాడు. జశ్వంత్ కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. బోరుబావిలో నుంచి జశ్వంత్ కేకలు వేయడంతో స్థానికులు అతనిని గుర్తించారు. వెంటనే తాళ్ల సహాయంతో బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు.

సుమారు 5 గంటలపైనే జశ్వంత్ బోరు బావిలో బిక్కుబిక్కుమంటూ గడిపాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. జశ్వంత్​ను ప్రమాదం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే బాలుడు పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బోరు బావి ప్రమాదం నుంచి జశ్వంత్ ప్రాణాలతో బయటపడటంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details