హైదరాబాద్లోని నిమ్స్ (నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్)లో నర్సింగ్ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. కేంద్రప్రభుత్వం సూచించినట్లుగా... ప్రైవేటు ఆసుపత్రుల్లో కనీస వేతనం రూ.20వేలు అమలయ్యేలా చూడాలంటూ వైద్యశాల ప్రాంగణంలో నిరసనకు దిగారు.
కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం నర్సింగ్ సిబ్బందికి నెలకు రూ. 20వేలు ఇవ్వాల్సి ఉందన్నారు. ఓ పక్క నిత్యవసర వస్తువుల ధరలు పైపైకి ఎగబాకుతున్నా.. అరకొర వేతనాలతోనే జీవితాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలున్నా.. కనీస వేతనానికి నోచుకోవడం లేదని వాపోయారు.