మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె వివాహం ఈనెల 9న జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా నూతన దంపతులు ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ముందుగా నిహారిక, చైతన్య దంపతులు సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
సత్యదేవుడ్ని దర్శించుకున్న నిహారిక, చైతన్య దంపతులు - అన్నవరంలో నిహారిక దంపతులు
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యదేవుని నిహారిక, చైతన్య దంపతులు దర్శించుకున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.
అన్నవరం సత్యదేవుడ్ని దర్శించుకున్న నిహారిక, చైతన్య దంపతులు
నూతన వధూవరులకు వేదపండితులు వేద ఆశీర్వచనాలు అందించారు. అధికారులు స్వామివారి ప్రసాదాన్ని నూతన వధూవరులకు అందజేశారు. ఉదయపూర్లో నిహారిక వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు మెగా ఫ్యామిలీ అంతా హాజరయ్యింది.
ఇదీ చదవండి:బద్రినాథ్ ఆలయాన్ని కప్పేసిన మంచు