తెలంగాణ

telangana

ETV Bharat / city

రాష్ట్రంలో వ్యవసాయానికి కరెంట్‌ కోతలు.. ఆందోళనలో రైతులు..

Current‌ cuts in Telangana: రాష్ట్రంలో వ్యవసాయానికి రాత్రి పూట కరెంట్​ కోతలు మొదలయ్యాయి. రెండు రోజులుగా కొన్ని ప్రాంతాల్లో సింగిల్​ ఫేజ్​ కరెంట్​ మాత్రమే సరఫరా చేస్తూ.. విద్యుత్​ కోత విధిస్తున్నారు. పంటలు చేతికొచ్చే వేళ విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో నీరు చాలడంలేదని పలు ప్రాంతాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Night power cuts for agriculture in Telangana
Night power cuts for agriculture in Telangana

By

Published : Apr 15, 2022, 6:57 AM IST

Current‌ cuts in Telangana: రాష్ట్రంలో రాత్రిపూట సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌ మాత్రమే సరఫరా చేస్తూ వ్యవసాయానికి విద్యుత్‌ కోత విధిస్తున్నారు. ఎండలతో విద్యుత్​ వినియోగం పెరగడం.. డిమాండ్‌కు సరిపడా ఉత్పత్తి లేకపోవడంతో రెండు రోజులుగా ఈ విధానం అమలు చేస్తున్నారు. త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా ఉంటేనే పొలాల్లో నీటి మోటార్లు నడుస్తాయి. పంటలు చేతికొచ్చే వేళ విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో నీరు చాలడంలేదని పలు ప్రాంతాల్లో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళన..:ములుగు జిల్లా గోవిందరావుపేటలో గురువారం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వ్యవసాయానికి త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేశారు. తర్వాత సింగిల్‌ ఫేజ్‌కు మార్చారు. ఈ క్రమంలో రాత్రి 10 గంటల సమయంలో ఈ సమయంలో చల్వాయి గ్రామ రైతులు గోవిందరావుపేట సబ్‌స్టేషన్‌ వద్ద ఆందోళనకు దిగారు. పగలు సైతం పూర్తిగా ఇవ్వడంలేదని పలు జిల్లాల రైతులు చెబుతున్నారు.

జిల్లాల వారీగా లోడ్‌ షెడ్యూళ్లు..: విద్యుత్‌ కొరత నేపథ్యంలో టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ సంస్థలు జిల్లాల వారీగా లోడ్‌ షెడ్యూళ్లను జారీచేస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేజ్‌ సరఫరా చేయాలని ఆదేశించగా.. మరికొన్ని జిల్లాల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సరఫరా చేస్తున్నారు. మార్చిలోనూ కొన్ని రోజులు త్రీఫేజ్‌కు కోతలు విధించిన సంగతి తెలిసిందే. సాంకేతిక కారణాలతో రెండు రోజులుగా సింగిల్‌ ఫేజ్‌ కరెంట్‌ సరఫరా చేశామని.. శుక్రవారం నుంచి త్రీఫేజ్‌ కరెంట్‌ను పునరుద్ధరిస్తామని ఎన్పీడీసీఎల్‌ సీఎండీ ఎ.గోపాలరావు తెలిపారు.

  • వికారాబాద్‌ జిల్లాలో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి సింగిల్‌ ఫేజ్‌ మాత్రమే సరఫరా చేశారు.
  • ఖమ్మం జిల్లాలో గురువారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకే త్రీఫేజ్‌ ఇచ్చారు.
  • కరీంనగర్‌ జిల్లాలో ఉదయం 10 నుంచి సాయంత్రం గంటల వరకు త్రీఫేజ్‌ సరఫరా చేశారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details