Night Curfew in AP: కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది.
Night Curfew in AP : ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధింపు - ఏపీలో రాత్రి కర్ఫ్యూ
![Night Curfew in AP : ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధింపు Night Curfew in AP](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14146710-thumbnail-3x2-a.jpg)
14:12 January 10
Night Curfew in AP : ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ విధింపు
AP Government Imposes Night Curfew : ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో భౌతికదూరం తప్పనిసరిగా పాటించాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి సూచించారు. కరోనా నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలు మాస్కు ధరించేలా చర్యలు చేపట్టాలని చెప్పారు. 50 శాతం సామర్థ్యంతో థియేటర్లు నడపాలన్నారు.
Night Curfew in AP : 'బహిరంగ కార్యక్రమాల్లో 200 మందికి మించకూడదు. ఇండోర్ కార్యక్రమాల్లో 100 మంది కంటే ఎక్కువగా పాల్గొనకూడదు. త్వరలోనే కరోనా నిబంధనలు, రాత్రి కర్ఫ్యూకు సంబంధించి రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. ఈ మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటించాలి. కొవిడ్ నిబంధనల ఉల్లంఘన జరగకుండా అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టాలి. ప్రజలు నిర్లక్ష్యం వహించినా.. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకపోయినా కఠిన చర్యలుంటాయి. దయచేసి ప్రతి ఒక్కరు అధికారులకు, ప్రభుత్వానికి సహకరించండి. అందరం కలిసి కరోనా మహమ్మారిపై పోరాటం చేద్దాం. మహమ్మారిని మన రాష్ట్రం నుంచి తరిమికొడదాం.'
- జగన్మోహన్ రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి