ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది సెప్టెంబరు 4 తేదీ వరకూ రాత్రిపూట కర్ఫ్యూను పొడిగిస్తున్నట్టు ఏపీ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
CURFEW EXTEND: ఏపీలో రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు
ఏపీలో మరోసారి కర్ఫ్యూ పొడిగిస్తూ.. ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. వచ్చేనెల నాలుగో తేదీ వరకూ.... రాత్రి 11 నుంచి ఉదయం 6 వరకూ కర్ప్యూ నిబంధనలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.
కర్ఫ్యూ సమయంలో మరో గంట సడలింపు ఇచ్చినట్టు వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాత్రి 10 గంటలకు బదులుగా 11 గంటల వరకూ సడలింపు సమయాన్ని పెంచినట్టు స్పష్టం చేశారు. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకూ రాష్ట్రంలో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రకటించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆదేశాలు జారీచేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కర్ఫ్యూ అమలుపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. కరోనా పరిస్థితులను అంచనా వేస్తూ రాత్రి పూట కర్ఫ్యూ సమయంలో స్వల్ప మార్పులు చేసినట్టు వెల్లడించారు.