NIA Custodial Investigation: అతివాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలను ఎన్ఐఏ అధికారులు మూడోరోజు విచారిస్తున్నారు. నలుగురు కార్యకర్తలను కస్టడీలోకి తీసుకున్న అధికారులు... పీఎఫ్ఐ కార్యకలాపాలకు సంబంధించి వివరాలను రాబడుతున్నారు. మూడురోజుల కస్టడీలో భాగంగా ఇప్పటికే రెండురోజుల పాటు నిందితులను విచారించారు. ఇవాళ్టితో కస్టడీ ముగియనుంది.
నలుగురు నిందితులు రెహమాన్, వహీద్, జాఫరుల్లా, అబ్దుల్ వారిస్ నుంచి పీఎఫ్ఐకి సంబంధించిన పూర్తిస్థాయి కార్యకలాపాలు సేకరించేందుకు ఎన్ఐఏ అధికారులు ప్రయత్నిస్తున్నారు. విదేశాల నుంచి నిధుల సమీకరణ, దాడులకు సంబంధించి కుట్రలపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పీఎఫ్ఐని కేంద్రం నిషేధించగా... సర్కార్ నిర్ణయాన్ని నిరసిస్తూ పలు చోట్ల ఆందోళనలు జరిగాయి. మరోవైపు పీఎఫ్ఐ అనుబంధ సంస్థలపైనా ఎన్ఐఏ అధికారులు నిఘా పెట్టారు.