బంగ్లాదేశీయులతో కలిసి నకిలీ కరెన్సీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా కీలక సూత్రధారిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. పశ్చిమ బంగాలోని మాల్ ప్రాంతంలో అదుపులోకి తీసుకొంది.
విశాఖపట్నంలో 2018లో డీఆర్ఐ అధికారులు భారీగా నకిలీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్ల ముద్రణ, చలామణిలో బంగ్లాదేశ్‌కు చెందిన కొందరి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు.
మహమ్మద్ మహబూబ్‌బేగ్, సయ్యద్ ఇమ్రాన్, ఫిరోజ్ షేక్, తాజాముల్ షేక్‌పై విజయవాడ, చెన్నై కోర్టుల్లో ఛార్జ్ షీట్లు దాఖలయ్యాయి. మహమ్మద్ మహబూబ్‌బేగ్, సయ్యద్ ఇమ్రాన్‌లకు 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. మిగతా ఇద్దరిపై విచారణ కొనసాగుతోంది.