దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ విచారణ కొనసాగుతోంది. మూడో రోజు ఎన్హెచ్ఆర్సీ సభ్యులు విచారిస్తున్నారు. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను రాష్ట్ర పోలీస్ అకాడమీలో విచారించినట్లు సమాచారం. దిశ ఘటన, ఎన్‌కౌంటర్ వరకు అన్ని విషయాలను ఎన్హెచ్ఆర్సీ సేకరించింది.
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను విచారించిన ఎన్హెచ్ఆర్సీ
దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై మూడో రోజు ఎన్హెచ్ఆర్సీ విచారణ కొనసాగుతోంది. ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులను, పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను విచారించినట్లు సమాచారం.
disha accused encounter
ఎన్ కౌంటర్లో గాయపడి గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎస్.ఐ.వెంకటేశ్వర్లు, కానిస్టేబుల్ అరవింద్‌లను కూడా వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ కేసులో నిందితుల కుటుంబసభ్యులను, దిశ కుటుంబసభ్యులను నిన్న విచారించారు. మానవ హక్కుల కమిషన్ విచారణకు సంబంధించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా జాగ్రత్త తీసుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఎన్హెచ్ఆర్సీ ఎదుట దిశ తండ్రి, సోదరి... అరగంటపాటు విచారణ
Last Updated : Dec 9, 2019, 8:54 PM IST