NGT: బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు - ఎన్జీటీ వార్తలు
12:35 August 14
NGT: బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దు
రాష్ట్రంలో చెరువుల పునరుద్ధరణపై ఎన్జీటీ తీర్పు వెలువరించింది. చెరువుల పరిధిలో ఆక్రమణల తొలగింపునకు చర్యలు చేపట్టాలని ఎన్జీటీ ఆదేశించింది. అక్రమ నిర్మాణాలు తొలగింపునకు న్యాయపరమైన చర్యలు చేపట్టాలని చెప్పింది. త్వరగా చెరువులు, కుంటల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లు ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. బఫర్ జోన్లలో నిర్మాణాలకు అనుమతులు ఇవ్వొద్దని ఎన్జీటీ స్పష్టం చేశారు. చెరువుల పరిరక్షణకు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించాలని సూచించింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశాలు జారీ చేసింది. శేరిలింగంపల్లి లింగంకుంటలో ఎస్టీపీ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఎన్జీటి చెన్నై ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇదీ చదవండి:Lorries trapped in flood: ఒక్కసారిగా పెరిగిన వరద... కృష్ణానదిలో చిక్కుకున్న 132 లారీలు