కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను జాతీయ హరిత ట్రైబ్యూనల్ జనవరి 20కి వాయిదా వేసింది. ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచిన తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ వేసిన మధ్యంతర పిటిషన్పై కౌంటర్ దాఖలు చేయాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి ఎన్జీటీ మూడు వారాల గడువు ఇచ్చింది. ప్రాజెక్టులో మార్పులు చేసి సామర్థ్యం పెంచిన తర్వాత ఎలాంటి అనుమతులు తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది హయతుద్దీన్ తెలపగా.. పర్యావరణ అనుమతులకు అనుగుణంగానే ప్రాజెక్టులో మార్పులు చేసినట్లు ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎన్జీటీ దృష్టికి తీసుకొచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కౌంటర్ దాఖలు చేయండి: ఎన్జీటీ
కాళేశ్వరం సామర్థ్యాన్ని పెంచిన తర్వాత పర్యావరణ అనుమతులు తీసుకోలేదంటూ వేసిన మధ్యంతర పిటిషన్పై జాతీయ హరిత ట్రైబ్యూనల్లో దాఖలైన పిటిషన్పై నేడు విచారణ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఎన్జీటీ ఆదేశించింది.
కాళేశ్వరం ప్రాజెక్టుపై కౌంటర్ దాఖలు చేయండి: ఎన్జీటీ
పిటిషనర్ లేవనెత్తుతున్న అభ్యంతరాలపై తెలంగాణ ప్రభుత్వం కౌంటర్ రూపంలో 3 వారాల్లో దాఖలు చేయాలంటూ... ఎన్జీటీ విచారణను వాయిదా వేసింది.
ఇవీ చూడండి: ఇవాళ మేడిగడ్డ, అన్నారం బ్యారేజీ పరిశీలన
Last Updated : Dec 11, 2019, 5:07 PM IST