రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిల్‌పై ఎన్జీటిలో విచారణ జరిగింది. పనులు జరపొద్దని ఎన్జీటి ఆదేశాలిచ్చినా వాటిని ఉల్లంఘించారంటూ గవినోళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్జీటికి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. పనులు జరగడం లేదని వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఎన్జీటీ ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేశారా అని ప్రశ్నించింది.తాము సవాలు చేయలేదని బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలను అనుగుణంగానే ముందుకు వెళ్తామని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది ఎన్జీటీకి వివరించారు. దీనిపై తదుపరి విచారణను జనవరి 18వ తేదీకి ఎన్జీటీ వాయిదా వేసింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకం పర్యావరణ అనుమతులు లేకుండా చేపట్టొదంటూ గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను ఏపీ ప్రభుత్వం ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జాతీయ హరిత ట్రైబ్యునల్ చెన్నై ధర్మాసనం ప్రాజెక్టుకు సంబంధించిన పనులపై ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగట్లేదు: ఏపీ ప్రభుత్వం - rayalaseema liftirrigation updates
రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్ ఆదేశాలు జారీ చేసింది. రాయలసీమ ఎత్తిపోతలపై దాఖలైన ధిక్కరణ పిల్ మీద ఎన్జీటీలో విచారణ జరిగింది. తదుపరి విచారణ జనవరి 18కి వాయిదా పడింది.
రాయలసీమ ఎత్తిపోతల పనులు జరగట్లేదు: ఏపీ ప్రభుత్వం