విశాఖపట్నం గ్యాస్ లీకేజీ ఘటనపై జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) కేంద్ర ప్రభుత్వం, ఎల్జీ పాలిమర్స్ ఇండియా ప్రైవేట్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్‌తో సహా మరి కొందరికి నోటీసులు జారీ చేసింది.
50 కోట్లు జమచేయండి.. ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్జీటీ నోటీసులు - విశాఖ పట్టణం వార్తలు
13:47 May 08
50 కోట్లు జమచేయండి.. ఎల్జీ పాలిమర్స్‌కు ఎన్జీటీ నోటీసులు
విశాఖ గ్యాస్ లీక్ ప్రమాదాన్ని తీవ్రంగా పరిగణించిన జాతీయ హరిత ట్రైబ్యునల్.. వెంటనే రూ.50 కోట్లు ఎన్జీటీలో జమచేయమని ఎల్‌జీ పాలిమర్స్ సంస్థను ఆదేశించింది. గ్యాస్ లీక్ ఘటనపై ఆరుగురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటుచేసింది.
జస్టిస్ శేషశయనారెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేసిన విచారణ కమిటీలో ఏయూ మాజీ వీసీ రామచంద్రమూర్తి, ఏయూ కెమికల్ ఇంజినీరింగ్ విభాగం అధిపతి పులిపాటి కింగ్, జాతీయ కాలుష్య నియంత్రణ బోర్డు కమిటీ మెంబర్ సెక్రటరీ, సీఎస్‌ఐఆర్ డైరెక్టర్, విశాఖ నీరి సంస్థ అధిపతి సభ్యులుగా ఉన్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి మే 18 లోపు నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది.
ఇవీచూడండి: విశాఖలో మరోసారి పొగలు.. హడలిపోతున్న ప్రజలు