రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ - రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో విచారణ
![రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ NGT](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10645694-464-10645694-1613457199716.jpg)
11:40 February 16
రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ
రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులు చేపట్టొద్దని ఎన్జీటీ చెన్నై బెంచ్ పునరుద్ఘాటించింది. గత ఆదేశాలను పాటించడం లేదంటూ... తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ను ఎన్జీటీ విచారించింది. పర్యావరణ అనుమతులు లేకుండా ముందుకెళ్లొద్దని మరోసారి ఆదేశించింది. సమాధానం ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఆదేశించింది.
నిజనిర్ధరణకు కమిటీ వేయాలని తెలంగాణ విజ్ఞప్తి చేయగా.. ఆ వినతిపై వివరణ ఇవ్వాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డును ఎన్జీటీ ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
ఇదీ చదవండి :'రాయలసీమ ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తప్పనిసరి'